సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఫస్టియర్ విద్యార్థి ఇంటిపై సీనియర్ల దాడి

సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఫస్టియర్ విద్యార్థి ఇంటిపై సీనియర్ల దాడి

హైదరాబాద్: సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని బాధిత స్టూడెంట్ తన సోదరుడికి చెప్పాడు. ర్యాగింగ్ ఎందుకు చేశారంటూ సీనియర్లను బాధిత విద్యార్థి సోదరుడు నిలదీశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీనియర్లు.. మమ్మల్నే నిలదీస్తవా అంటూ శాంతినగర్‎లో బాధితుడి ఇంటిపై యాభై మంది దాడికి దిగారు. 

బాధితుని తండ్రిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో సీనియర్లు, జూనియర్ల మధ్వ వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఇద్దరు విద్యార్థులను బంధించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. ఎంబీబీఎస్ స్టూడెంట్ల ఘర్షణతో శాంతినగర్‎ నగర్‎లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై కాలేజీ సిబ్బంది విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.