భూదందా కోసమే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లోకి: రఘునందన్

భూదందా కోసమే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లోకి: రఘునందన్

మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ఆరోపించారు. దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు.  మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై   సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్..  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.  వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని నిలదీశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభ కోణాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువని అన్నారు.  బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు.   

తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.