V6 News

‘ములాగ్‌’ మెడల్‌ సాధించిన ఏకైక క్రికెటర్

‘ములాగ్‌’ మెడల్‌ సాధించిన ఏకైక క్రికెటర్
‘ములాగ్‌’ మెడల్‌ సాధించిన రహానె మెల్‌‌బోర్న్‌‌: క్లాసిక్‌‌ సెంచరీతో ఇండియాకు విజయాన్ని అందించిన కెప్టెన్‌‌ రహానెకు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌తో పాటు ప్రతిష్టాత్మక ‘జానీ ములాగ్‌‌’ మెడల్‌‌ను బహుకరించారు. ఈ మెడల్‌‌ను సాధించిన ఏకైక క్రికెటర్‌‌గా అజింక్యా రికార్డులకెక్కాడు. ఈ మెడల్‌‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఆదిమ జాతికి చెందిన ములాగ్‌‌ (విక్టోరియా).. 1868లో ఆసీస్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోనే కంగారూల టీమ్‌‌ ఫస్ట్‌‌ టైమ్‌‌ విదేశీ టూర్‌‌ (ఇంగ్లండ్‌‌)కు వెళ్లింది. ఆ లాంగ్‌‌ టూర్‌‌లో 47 మ్యాచ్‌‌లు ఆడిన ములాగ్‌‌ 1698 రన్స్‌‌ చేశాడు. మంచి ఆల్‌‌రౌండర్‌‌గా గుర్తింపు పొందిన అతను 831 ఓవర్లు వేసి 245 వికెట్లు కూడా తీశాడు. వికెట్‌‌ కీపర్‌‌గానూ నాలుగు స్టంపింగ్స్‌‌ చేశాడు. దీంతో ఆనాటి పాతతరం క్రికెటర్‌‌కు గౌరవంగా బాక్సింగ్‌‌ డే టెస్ట్‌‌లో ములాగ్‌‌ మెడల్‌‌ను ఇచ్చారు. For More News.. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మంచిదేనా? ఏమైనా రిస్క్ ఉందా? న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా శాలరీ డేస్‌‌‌‌‌‌‌‌’ ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్