టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు 

టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు 

టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం T20 వరల్డ్ కప్ తో ముగియనుంది.  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ (ICC)టోర్నీ తర్వాత రవిశాస్త్రి కొనసాగే అవకాశాలు లేకపోవడంతో BCCI కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్  దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని BCCI వర్గాలు తెలిపాయి.

భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రావిడ్ మొదట ఇంట్రెస్ట్ చూపించనప్పటికీ .. ఇటీవల దుబాయ్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ తర్వాత అంగీకరించినట్టు తెలుస్తోంది.