ముంబై: టీమిండియా లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా శుక్రవారం నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కోచ్‌గా పదవీకాలం ముగించుకున్న ద్రవిడ్ తిరిగి రాయల్స్ జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు. ఇది వరకు 2011 నుంచి 2015 వరకు రాయల్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా ఉన్న ద్రవిడ్ తాజా కాంట్రాక్టులో భాగంగా మరికొన్ని సంవత్సరాలు కోచ్ బాధ్యతలు చేపడుతాడు. రాజస్తాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కరతో కలిసి పని చేయనున్నాడు.