వయనాడ్కు రాహుల్.. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారి

వయనాడ్కు రాహుల్..  ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారి

లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 11 మంగళవారం రోజున కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో పర్యటించనున్నారు.  రాహుల్ పర్యటన సందర్భంగా ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆయన వెంట వెళ్లనున్నారు.  వయనాడ్  మాజీ ఎంపీకి ఘనంగా స్వాగతం పలకాలని యూడీఎఫ్ జిల్లా కమిటీ నిర్ణయించింది.  ఈ సందర్భంగా రోడ్ షోతో పాటుగా బహిరంగసభలో రాహుల్ పాల్గొననున్నారు.  

మధ్యాహ్నం 3.30 గంటలకు కలపేటలోని ఎంపీ కార్యాలయం ఎదుట జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ  ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్, ఏఐసీసీ సభ్యులు, కేపీసీసీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాహుల్ చివరిసారిగా ఫిబ్రవరిలో వయనాడ్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన  గౌతమ్ అదానీతో సంబంధాలు పెట్టుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.