మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్

మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్  శ్రేణులను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఇక రెండో రోజు 10 గంటల పాటు రాహుల్ ను విచారించింది ఈడీ. సుమారు 80 ప్రశ్నలను ఈడీ సంధించినట్లు తెలుస్తోంది. కాగా  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈడీని కేంద్రం ఎలక్షన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్​గా వాడుకుంటోందని, ఇప్పటిదాకా ప్రత్యర్థులపై 5 వేల కేసులు పెట్టించిందని ఆరోపించింది. సోనియా, రాహుల్ లపై ఎన్ని అక్రమ  కేసులు పెట్టిన వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.