అర్ధాపూర్ నుంచి భారత్ జోడో యాత్ర పున:ప్రారంభం

అర్ధాపూర్ నుంచి భారత్ జోడో యాత్ర పున:ప్రారంభం

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది.  నాందేడ్ జిల్లాలోని అర్ధాపూర్ నుంచి ఇవాళ యాత్ర పున:ప్రారంభమైంది.  మరోవైపు గురువారం నాందేడ్ జిల్లాలోని కాష్టి చౌక్ వరకు యాత్ర సాగింది. ఈ యాత్రలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

https://twitter.com/ANI/status/1590878978478583808

యాత్రలో ఆదిత్య ఠాక్రే..
భారత్ జోడో యాత్రలో ఇవాళ శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉండగా... ఆకస్మిక అనారోగ్యం కారణంగా.. పవార్ ఆసుపత్రిలో చేరారని.. అందుకే హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు. సెప్టంబర్ 7న భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది.  తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని మహారాష్ట్రాలో కొనసాగుతుంది. ఈ యాత్ర జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనుంది. 150 రోజుల్లో 3,570 కి.మీల మేర కొనసాగనుంది.