
రిజర్వ్ బ్యాంక్ అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న నిర్ణయంపై ట్విట్టర్ లో సెటైర్ వేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సృష్టించిన ఎకనమిక్ డిజాస్టర్ ను.. ఎలా అధిగమించాలో వాళ్లకే తెలియడం లేదన్నారు. ఆర్థికమాంద్యాన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై.. కేంద్రం దగ్గర ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఆర్థికవ్యవస్థను చక్కదిద్దేందుకు… ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవడం ఎంతమాత్రం వర్కవుట్ కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడమంటే….బుల్లెట్ గాయానికి.. బ్యాండ్ ఎయిడ్ వేయడం లాంటిదేనన్నారు రాహుల్.