రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందనలు.. ట్విట్టర్​లో పోస్ట్

రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందనలు.. ట్విట్టర్​లో పోస్ట్

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. బుధవారం ట్విట్టర్​లో పోస్ట్ పెట్టారు.  తాను, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఢిల్లీలో  తీసుకున్న ఫొటోను  సోషల్ మీడి యాలో షేర్ చేశారు.

‘రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చి, ప్రజల సర్కార్​ను నిర్మిస్తుంది’ అని పోస్ట్​ చేశారు.