రాహుల్ గాంధీది ఫారెన్ మెంటాలిటీ

రాహుల్ గాంధీది ఫారెన్ మెంటాలిటీ

బల్లియా: రేప్‌‌లను నియంత్రించాలంటే సంస్కారంతోనే సాధ్యమని ఉత్తర్ ప్రదేశ్‌‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువలు, సంస్కారాన్ని నేర్పించాలని సురేంద్ర చేసిన కామెంట్స్‌‌పై కాంట్రవర్సీ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై సురేంద్ర పలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీది ఫారెన్ మెంటాలిటీ అని చెప్పారు. హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను రాహుల్, ప్రియాంక కలసిన నేపథ్యంలో సురేంద్ర కామెంట్స్ చేశారు.

‘రాహుల్ గాంధీది రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిత్వం. ఆయనది విదేశీ మనస్తత్వం. రాహుల్‌‌కు  భారతదేశ సంస్కృతి గురించి ఏమాత్రం అవగాహన లేదు. జాతీయవాదుల నుంచి శిక్షణ తీసుకుంటే ఆయనకు నేషనలిజం నిర్వచనం ఏంటో అర్థం అవుతుంది. దేశ సంస్కృతిలోని కీలక అంశాలను ఆయన అర్థం చేసుకోలేరు. హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను కలవడానికి వెళ్లున్న సమయంలో రాహుల్, ప్రియాంకల రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిత్వం బయటపడింది. ఆ ప్రయాణంలో వారు నవ్వుతూ కనిపించారు. కానీ బాధితురాలి ఇంటికి వెళ్లాక మాత్రం కన్నీళ్లు కార్చారు’ అని సురేంద్ర పేర్కొన్నారు.