యువత దీక్షకు రాహుల్ సంఘీభావం

యువత దీక్షకు రాహుల్ సంఘీభావం

వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. నేషనల్ హైవే 766 పై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ యూత్ చేపట్టిన నిరసన దీక్షలో రాహుల్ పాల్గొన్నారు. యూత్ వెంటే ఉంటానని, సున్నితమైన ఈ  సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. రోజూ రాత్రి పూట 9 గంటల పాటు నేషనల్ హైవే 766పై కేరళ, కర్ణాటక మధ్య రాకపోకలను నిషేధించారు.

దీనిపై సెప్టెంబర్ 25 నుంచి పార్టీలకతీతంగా యువత నిరాహార దీక్ష చేపడుతున్నారు. వీరికి రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. అటవి జంతువులకు నష్టం లేకుండా కోర్టు ఈ రాకపోకలపై నిషేధం విధించింది.