కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ 

కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ 

కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా.. నిర్ణయాలు తీసుకోవడంలో, పార్టీని నడిపించడంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ‘‘మాది ఫాసిస్ట్ పార్టీ కాదు. ఎన్నికల్లో గెలవాలంటే మేము జట్టుగా పని చేయాల్సి ఉంటుందన్న విషయం మాకు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు.

22 ఏళ్ల తర్వాత ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక మాండ్యా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.