దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుంటే.. మోడీ మెలోనికి చాక్లెట్లు పంచుతుండు: రాహుల్ విమర్శలు

దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుంటే.. మోడీ మెలోనికి చాక్లెట్లు పంచుతుండు: రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోడీ చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇస్తూ రీల్స్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశంలో ఆర్థిక తుఫాన్ ముంచుకురాబోతుంటే ప్రధాని మోడీ మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారని  ఎద్దేవా చేశారు. 

దేశంలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కన్నీరు పెడుతుంటే.. ప్రధాని నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారని.. దానికి బీజేపీ నేతలు చప్పట్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నాయకత్వం కాదని.. ముమ్మాటికీ డ్రామా అని విమర్శలు గుప్పించారు.  పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభంతో సామాన్య భారతీయులు సతమతమవుతుండగా ప్రధాని మోడీ కేవలం ప్రచార ఆర్భాటాలపైనే దృష్టి సారిస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 

మెలోనికి మోడీ మెలోడి గిఫ్ట్..!

ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశ పీఎం జార్జియో మెలోనికి మెలోడి చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్‎గా ఇచ్చారు. ఈ విషయాన్ని జార్జియా మెలోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ క్లిప్‌లో ప్రధాని మోడీ చాక్లెట్ ప్యాకెట్ పట్టుకుని కెమెరాకు చూపిస్తుండగా.. మోడీ తనకు మెలోడి చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారని మెలోని చెప్పారు.

►ALSO READ | థ్రిల్ కోసం ఎక్కితే 245 ఎత్తులో గాల్లోనే ఆగిపోయిన రోలర్ కోస్టర్ !

 ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్‎గా మారింది. దీంతో జార్జియో మెలోని, ప్రధాని మోడీ మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మోడీ, మెలోని పేర్లను కలిపి రూపొందించిన మెలోడీ హ్యాష్‌ట్యాగ్‌ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.