టెక్సాస్‌లోని సిక్స్ ఫ్లాగ్స్ అనే అమెరికన్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో.. అత్యంత ఎత్తైన రోలర్ కోస్టర్‌లలో ఒకటి సాంకేతిక సమస్య తలెత్తడంతో గాల్లోనే ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ పరిణామంతో భయంతో వణికిపోయిన ఆ రోలర్ కాస్టర్ ఎక్కిన సందర్శకులు పై నుంచి ఆచితూచి కిందకు దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Power outage at Six Flags over the weekend 😳 pic.twitter.com/7shI23LBsa
— Dallas Texas TV (@DallasTexasTV) May 18, 2026
ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అంతటా ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ల పరిస్థితి ఏంటో తెలియదు గానీ దాదాపు గంట పాటు సందర్శకులు ఆ రోలర్ కాస్టర్లోనే చిక్కుకుపోయారు. రోలర్ కాస్టర్ ట్రాక్‌లను పట్టుకుని కిందకు దిగాల్సి వచ్చింది.
దాదాపు 245 అడుగుల ఎత్తులో ఈ టైటాన్ రోలర్ కోస్టర్ ఆగిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. సుమారు 30 మంది వ్యక్తులు అంత ఎత్తులో గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో.. రెయిలింగ్‌లను గట్టిగా పట్టుకుని.. నిటారుగా ఉన్న రోలర్ కాస్టర్పై నుంచి ఒకరి వెనుక ఒకరుగా దిగుతూ కనిపించారు.
ALSO READ : మోడీ మెలోడీ వీడియోతో ఇన్వెస్టర్లలో కన్ఫ్యూజన్..
ఎవరీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం, సురక్షితంగా కిందకు దిగడంతో సిక్స్ ఫ్లాగ్స్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. విద్యుత్ అంతరాయం సమయంలో పార్కులో ఉన్న ప్రతీ విజిటర్కు ఫ్రీ టికెట్ ఇచ్చి ఆదివారం విజిట్ చేయొచ్చని అమ్యూజ్మెంట్ పార్క్ యాజమాన్యం స్పష్టం చేసింది.
