అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (జూలై 4, 2026) చాలా గ్రాండ్‌గా మొదలుపెట్టింది. దింతో ఆ దేశవ్యాప్తంగా డ్రోన్ షోలు, క్రాకర్స్, విమానాల విన్యాసాలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా టెక్సాస్ ఆకాశంలో రాత్రి కాల్చిన బాణసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశంలో అమెరికా జాతీయ పక్షి అయిన బాల్డ్ ఈగిల్, అంకుల్ సామ్ బొమ్మలు కనిపించేలా క్రాకర్స్ కాల్చారు. నార్త్ రిచ్‌లాండ్ హిల్స్‌లో 2,500 డ్రోన్లను ఉపయోగించి ఆకాశంలో ఒక పెద్ద రాకెట్, గద్ద, అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చిత్రాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
వాషింగ్టన్ డిసిలో సైనిక విన్యాసాలు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో 'గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్' పేరిట సైనిక విమానాలతో ప్రదర్శనలు చేశారు. ఆర్మీకి చెందిన 'గోల్డెన్ నైట్స్', నేవీకి చెందిన 'లీప్ ఫ్రాగ్స్' పారాచూట్ టీమ్స్ ఒక భారీ అమెరికా జెండాను పట్టుకుని ఆకాశం నుండి కిందకు దూకారు. ఎయిర్ ఫోర్స్ విమానాలు గాల్లో రకరకాల విన్యాసాలు చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటించబోయే 'మౌంట్ రష్మోర్' (అధ్యక్షుల ముఖాలు చెక్కిన కొండ) పైనుంచి కూడా యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. లాస్ వెగాస్‌లోని ప్రసిద్ధ 'ది స్ఫియర్' భవనం, వాషింగ్టన్ మాన్యుమెంట్‌లు దేశభక్తిని పెంపొందించే రంగురంగుల లైట్లతో మెరిసిపోయాయి.
ALSO READ : E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ?....
జపాన్‌లోనూ వేడుకలు
ఈ సంబరాలు కేవలం అమెరికాలోనే కాదు, జపాన్ రాజధాని టోక్యోలో కూడా జరిగాయి. అక్కడి ప్రసిద్ధ టోక్యో టవర్, రెయిన్‌బో బ్రిడ్జ్‌లను అమెరికా జెండా రంగులైన ఎరుపు, తెలుపు, నీలం లైట్లతో అలంకరించారు. అక్కడ కూడా డ్రోన్ షో, క్రాకర్స్ షోలు చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో #A250inJapan అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని టోక్యోలోని అమెరికా ఎంబసీ ప్రజలను కోరింది. ఈ భారీ వేడుకలన్నింటినీ "అమెరికా 250" అని పిలుస్తున్నారు. అలాగే అమెరికా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.
