సర్పై స్టే విధించండి ..సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

సర్పై స్టే విధించండి ..సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై మధ్యంతర స్టే విధించాలని, తొలగించిన ఓట్లపై స్వతంత్ర కమిటీతో ఆడిట్ చేయించాలని లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. మంగళవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌లో రాహుల్​ ప్రధానంగా 10 అంశాలను ప్రస్తావించారు. 

అవి..

  •    సర్​కు సంబంధించిన అన్ని రికార్డులు సమర్పించాలి.
  •     సర్​లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు రాజ్యాంగబద్ధత ఉందా అనేది పరిశీలించాలి.
  •     ఓట్ల తొలగింపునకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
  •     ప్రజల ఫిర్యాదులకు వేగంగా పరిష్కారం చూపాలి.
  •     ఆన్లైన్ ఫామ్-6 ను రూల్స్​కు అనుగుణంగా మార్చాలి.
  •     స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ‘సర్’​ లో ఓట్ల తొలగింపులపై ఆడిట్ జరిపించాలి.
  •     సర్​లో భాగంగా తొలగించిన ఓటర్ల పేర్లు, కారణాలు వెల్లడించాలి.
  •     నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏ ఒక్క ఓటరు పేరూ తొలగించకూడదు.
  •     ప్రస్తుతం కొనసాగుతున్న సర్​ ప్రాసెస్ పై మధ్యంతర స్టే విధించాలి.
  •     వీటికి అదనంగా పౌరుల ఓటు హక్కు పరిరక్షణకు కోర్టు అవసరమని భావించే ఆదేశాలు ఇవ్వాలి.  

​పిటిషన్‌‌లో లోపాలు : సుప్రీం

పిటిషన్‌‌లో 14 లోపాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. కోర్టు ఫీజును రూ.220 తక్కువగా చెల్లించినట్టు తెలిపింది. తొమ్మిది మంది పిటిషనర్ల నుంచి ధ్రువీకరణ పత్రాలు (అథరైజేషన్లు) లేకపోవడం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతి స్పష్టంగా లేకపోవడం వంటి సాంకేతిక లోపాలను ఎత్తిచూపింది. తదుపరి విచారణ నిమిత్తం ఈ లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించింది