రాహుల్ గాంధీకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

రాహుల్ గాంధీకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి రెండో సారి ఎంపీగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యలయం వద్దకు వెళ్లి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను పొందు పరిచారు రాహుల్. తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

అందులో రూ.9.24 కోట్ల చరాస్తులు, రూ. 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. 2022-23లో తన వార్షిక ఆదాయం రూ.కోటిగా ప్రకటించారు. సొంత కారుగానీ, రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ గానీ లేదని పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ.4.33 కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81 కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్నట్లు తెలిపారు. 

తన వద్ద రూ.55వేల నగదు, రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్‌ బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని మెహరౌలి ఉన్న వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. తన పై 18 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.