సౌత్‌‌ అమెరికా పర్యటనకు రాహుల్‌‌ గాంధీ

సౌత్‌‌ అమెరికా పర్యటనకు రాహుల్‌‌ గాంధీ
  • వర్సిటీ స్టూడెంట్లు, రాజకీయ నాయకులతో భేటీ కానున్న రాహుల్‌‌
  • పర్యటన వివరాలు వెల్లడించిన ఆ పార్టీ నేత పవన్‌‌ ఖేరా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌ ఎంపీ, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు కాంగ్రెస్‌‌ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌‌మెంట్‌‌ ఇన్‌‌చార్జ్‌‌ పవన్ ఖేరా శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సౌత్‌‌ అమెరికాలోని నాలుగు దేశాల్లో ఆయన పర్యటిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లోని రాజకీయ నాయకులు, యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌, వ్యాపారవేత్తలతో రాహుల్‌‌ భేటీ అవుతారని ‘ఎక్స్‌‌’లో వెల్లడించారు.

 అయితే, రాహుల్‌‌ గాంధీ ఎన్ని రోజులు సౌత్‌‌ అమెరికాలో పర్యటిస్తారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. సౌత్‌‌ అమెరికాలోని బ్రెజిల్‌‌, కొలంబియా దేశాల్లో యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌తో రాహుల్‌‌ సమావేశం అవుతారని పార్టీ తెలిపింది. దేశాల సీనియర్‌‌‌‌ రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించి, ప్రజాస్వామ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తారని వెల్లడించింది.