నవంబర్ 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటనలు

నవంబర్ 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటనలు

బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ సారి ఎన్నికలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం పట్టుదలగా ఉంది.ఈ క్రమంలో  కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  స్వయంగా వారే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ ను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. 

ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్, ప్రయాంక గాంధీలు.. మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా.. 2023, నవంబర్ 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణలో  సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 24న పాలకుర్తి‌, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనుండగా.. నవంబర్ 25న మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు.