BJP, RSS దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి : రాహుల్ గాంధీ

BJP, RSS   దేశంలో  విధ్వంసం సృష్టిస్తున్నాయి  : రాహుల్ గాంధీ

BJP, RSS దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి బీజేపీకి TRS మద్దతు పలుకుతుందన్నారు. ఉభయ సభల్లో బీజేపీకి, టీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 

ధరణి పోర్టల్ పై రాహుల్ కీలక కామెంట్స్ చేశారు. ప్రతి  రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తారని.. ఎక్కడెక్కడ భూములున్నాయి.. ఎవరి భూములు లాక్కోవాలని కేసీఆర్ చూస్తారంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజుల పాలన కొనసాగుతుందని రాహుల్ విమర్శించారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేస్తామని హమీ ఇచ్చారు. దళితుల భూములకు వారికే  పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. అలాగే GST లో మార్పులు చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.  జనం సమస్యలు తెలుసుకునేందుకే  ఈ యాత్రను చేస్తున్నట్టుగా  రాహుల్ స్పష్టం చేశారు. 

భారత్ జోడో యాత్రకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. రోజు 25 కిలోమీటర్లు నడిచినప్పటికీ శ్రమ , అలసట అనిపించటం లేదన్నారు. ఈ యాత్ర ఎక్కడా ఆగదని, కాశ్మీర్ లోనే పూర్తవుతుందని వెల్లడించారు.  కాంగ్రెస్ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అన్న రాహుల్... బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనన్నారు. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు  డ్రామాలాడుతాయన్నారు.