అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ

అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ

అనర్హత వేటుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను దేశం గొంతు వినిపించేందుకు పోరాడుతున్నానని అన్నారు.  దీనికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్దమని స్పష్టం చెప్పారు.  కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రాహుల్ అనర్హత వేటుపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పార్టీ నేతలు న్యాయ పోరాటం చేస్తామని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెబుతున్నారు. అంతేకాకుండా చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  

ప్రధాని మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మార్చి 23న సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై వేటు వేసినట్టు లోక్ సభ వెల్లడించింది. ఇక పార్టీ నాయకుడిపై ఈ రకమైన చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.