మోదీ.. భయపడ్తున్నారా .. అంబానీ, అదానీ పేర్లను ఫస్ట్ టైం పబ్లిక్​గా పలికిన్రు: రాహుల్

మోదీ.. భయపడ్తున్నారా .. అంబానీ, అదానీ పేర్లను ఫస్ట్ టైం పబ్లిక్​గా పలికిన్రు: రాహుల్
  • వాళ్లు టెంపోల్లో డబ్బులు ఇస్తరా.. అది మీ అనుభవమేనా? 
  • వాళ్ల వద్దకు సీబీఐ, ఈడీని పంపాలని సవాల్  
  • మోదీ కామెంట్లకు కౌంటర్​గా వీడియో మెసేజ్ రిలీజ్ 

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు అంబానీ, అదానీల గురించి ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయారని.. వారితో ఏమైనా డీల్ కుదుర్చుకున్నారా? అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేసిన కామెంట్లకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దీటుగా కౌంటర్ ఇచ్చారు. అంబానీ, అదానీల గురించి మోదీ తొలిసారి బహిరంగంగా మాట్లాడుతున్నారని రాహుల్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నమస్కారం మోదీ.. మీకు కొంచెం భయంగా ఉందా ఏంటీ? సాధారణంగా మీరు తలుపులు మూసుకుని మాత్రమే అంబానీ, అదానీల గురించి మాట్లాడతారు. 

కానీ ఫస్ట్ టైం పబ్లిక్ గా వారి పేర్లు పలికారు. వాళ్లు టెంపోల్లో డబ్బులు ఇస్తారని కూడా మీకు తెలుసా? అది మీ వ్యక్తిగత అనుభవమా ఏంటీ? ఓ పని చేయండి. వాళ్ల వద్దకు సీబీఐ, ఈడీని పంపండి. ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించండి. భయపడొద్దు మోదీ..” అని రాహుల్ సవాల్ విసిరారు. ‘‘నేను దేశానికి మళ్లీ చెప్తున్నా. ఈ ఇండస్ట్రియలిస్టులకు నరేంద్ర మోదీ ఎంత మొత్తంలో డబ్బు అయితే ఇచ్చారో... అంతే మొత్తం డబ్బును కాంగ్రెస్ దేశంలోని పేదలకు ఇస్తుంది. బీజేపీ 22 మందిని మాత్రమే కోటీశ్వరులను చేసింది. కానీ మేం మహాలక్ష్మి యోజన, పెహలీ నౌక్రీ పక్కీ యోజన ద్వారా కోట్ల మందిని లక్షాధికారులను చేస్తాం” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.