తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: రాహుల్

తెలంగాణలో  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: రాహుల్

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని  కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ  అన్నారు. కర్ణాటక ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ చాలా పాఠాలు నేర్చుకుందన్న రాహుల్...కన్నడనాట కాంగ్రె స్ విజయాన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. 

కుల జనాభా గణన నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, సంపదలో అసమానతలు, OBC, ట్రైబల్స్ సమస్యలపై మోదీ సర్కార్ ఏమాత్రం దృష్టిపెట్టడంలేదని విమర్శించారు  రాహుల్ గాంధీ.