గాంధీ మార్గం..అమాయకులకు సైతం ఎదిరించే శక్తినిస్తుంది: రాహుల్ గాంధీ

గాంధీ మార్గం..అమాయకులకు సైతం ఎదిరించే శక్తినిస్తుంది: రాహుల్ గాంధీ
  • ఆయనకు  ఎలాంటి బ్రాంచ్ ఎడ్యుకేట్ సర్టిఫికెట్ అవసరం లేదు
  • యావత్ ప్రపంచానికి చీకటితో పోరాడే శక్తిని అందించిన సూర్యుడు మహాత్ముడు 

యావత్ ప్రపంచానికి చీకటితో పోరాడే శక్తిని..అందించిన సూర్యుడు మహాత్మగాంధీజీ అని అన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. సత్యం,అహింస రూపంలో అందరికీ ఒక మార్గాన్ని చూపాడన్నారు. ఇది అమాయక వ్యక్తులకు కూడా అన్యాయాన్ని ఎదురించే ధైర్యాన్ని ఇస్తుందన్నారు. వారికి ఎలాంటి శాఖాపరమైన ఎడ్యుకేటెడ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు రాహుల్ గాంధీ.

 మరోవైపు ప్రధాని మోదీకి మహాత్మా గాంధీ గురించి ఏం తెలియదన్నారు AICCప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. గాంధీ సినిమా చూసి తెలుసుకోవడం మోదీ అవివేకానికి నిదర్శన మన్నారు. గాంధీజీ ప్రపంచానికి సత్యం, అహింసను బోధిస్తే.. మోదీ ప్రజల మధ్య విధ్వేషాన్ని పెంచుతున్నారని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం పై ఇండియా కూటమి పోరాడుతోందన్నారు