అబద్ధాలను, ద్వేషాన్ని జనం తిరస్కరించారు: రాహుల్ గాంధీ

అబద్ధాలను, ద్వేషాన్ని జనం తిరస్కరించారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో అబద్ధాలను, ద్వేషాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ జీవితాలకు సంబంధించిన అసలు సమస్యలకే వారు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. శనివారం న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో తన తల్లి సోనియా గాంధీతో కలిసి వచ్చి ఆయన ఓటేశారు. అనంతరం తన తల్లితో కలిసి ఓటు వేసినట్లు వేలిపై సిరా గుర్తును చూపుతూ తీసుకున్న ఫొటోను రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

 ‘‘మొదటి ఐదు విడతల్లో మీరు అబద్ధాలను, ద్వేషాన్ని, తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించా రు. క్షేత్రస్థాయిలో మీ జీవితాలకు సంబం ధించిన అసలైన సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతకు ఏటా రూ. లక్ష అందించే ఫస్ట్ జాబ్ గ్యారంటీ స్కీం, మహిళలకు నెలకు రూ. 8,500 ఆర్థిక సాయం చేసే పథకం, రైతులకు రుణమాఫీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి” అని కోరారు.