దేశంలో అవినీతిపరులకు అమృతకాలం నడుస్తోంది : రాహుల్ గాంధీ

దేశంలో అవినీతిపరులకు అమృతకాలం నడుస్తోంది  :  రాహుల్  గాంధీ

దేశంలో అవినీతిపరులకు అమృతకాలం నడుస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్  గాంధీ. 777 కోట రూపాయాలతో నిర్మించిన ప్రగతి మైదాన్ టన్నెల్ ఏడాదిలోనే ధ్వంసమైందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ ప్లానింగ్ తో కాకుండా మోడలింగ్ తో ముందుకెళ్తున్నారని విమర్శించారు రాహుల్. 

ఈడీ, సీబీఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.  సెంట్రల్‌ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. ‘ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌’ చేపట్టారు. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ వీటిని ప్రారంభించారు.  

రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారత్ జోడ్ న్యాయ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించారు. ఒడిషాలో ముగించుకున్న రాహుల్.. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగనుంది. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు.