చలో ఢిల్లీ ఆందోళన.. హరియాణాలో ఇంటర్‌నెట్ సేవలు బంద్

చలో ఢిల్లీ ఆందోళన..  హరియాణాలో ఇంటర్‌నెట్ సేవలు బంద్

రైతుల నిరసనల దృష్ట్యా హర్యానాలోని ఏడు జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.  రైతులు కనీస మద్దతు ధరతో సహా తమ డిమాండ్ల కోసం ఒత్తిడి చేసేందుకు 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ప్లాన్ చేశారు.  ఈ క్రమంలో..  అంబాలా, కురుక్షేత్ర, కైతాల్‌, జింద్‌, హిస్సార్‌, ఫతేబాద్‌, సిస్రా జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.  వాయిస్‌ కాల్స్‌ మినహా ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు నిలిపివేయబడ్డాయి. 

 ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 13 రాత్రి 11:59 వరకు ఈ నిలిపివేతలు  అమలులో ఉండనున్నాయి. యుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న (మంగళవారం) 'ఢిల్లీ చలో' మార్చ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి . 

రైతుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని అంబాలాలో హర్యానా పోలీసులు  బారికేడింగ్‌లు ఏర్పాటు చేశారు.  ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.