దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించక, రిఫ్లెక్టర్లు లేకపోవడంతో ఒక యువ టెక్నీషియన్ కారు అదుపు తప్పి సుమారు 70 అడుగుల లోయలో ఉన్న నీటిలో పడింది. అదే సమయంలో అక్కడ నుండి వెళ్తున్న కొందరు యువరాజ్ మెహతా అరుపులు విని కాపాడేందుకు ట్రై చూశారు, కానీ అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
అయితే చనిపోయే ముందు యువరాజ్ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేసి "నాన్న, నేను లోతైన గుంటలో పడిపోయాను. నీటిలో మునిగిపోతున్నాను. వెంటనే వచ్చి నన్ను కాపాడండి" అని అన్నారు.
►ALSO READ | గాల్లో ఉండగా బాంబ్ బెదిరింపు.. లక్నోలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సమాచారం అందుకున్న పోలీసులు, NDRF బృందాలు అక్కడికి చేరుకుని వెంటనే చర్యలు చేపట్టాయి. అప్పటికే అతని తండ్రి కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కారు, యువరాజ్‌ను బయటకు తీశారు. కానీ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలకు కవర్లు లేకపోవడం, సరైన బోర్డులు లేదా రిఫ్లెక్టర్లు పెట్టకపోవడం వల్లే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజలు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని నిరసన తెలిపారు. ఘటన జరిగిన తర్వాత అధికారులు ఆ గుంటను పూడ్చివేశారు.
