మాటంటే మాట.. అప్పుడు తెలంగాణ ఇస్తమన్నం.. ఇచ్చినం.. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తం..

మాటంటే మాట.. అప్పుడు తెలంగాణ ఇస్తమన్నం.. ఇచ్చినం.. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తం..

కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. తెలంగాణను రాష్ట్ర ప్రజలు, రైతులు, సామాన్యులు, పేదలు, కార్మికుల కోసం ఇచ్చామన్నారు. కానీ గత 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. తెలంగాణను ఇస్తామని చెప్పాం ఇచ్చినం..ఇప్పుడు గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని చెబుతున్నాం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ ఏం మాట ఇస్తే తప్పనిసరిగా ఆ మాట నిలబెట్టుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు.  ఏం జరిగినా..ఎంత నష్టపోయినా..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. గతంలో 2012లో తెలంగాణ విషయంలో ఆలోచన చేస్తామన్నారు. ఆ తర్వాత  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలతో పోరాడుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీలు ఒక్కటే అన్నారు.  లోక్ సభలో  మోదీ ప్రభుత్వం ఎలాంటి బిల్లును ప్రవేశపెట్టినా..బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. కిసాన్ బిల్, జీఎస్టీ బిల్లు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని చెప్పారు. 

బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నాయకులపై ఏదో ఒక కేసు పెట్టిందన్నారు రాహుల్ గాంధీ. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాల నేతలపై  కేసులు పెట్టిందన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. ఎంఐఎం  నాయకులపై కూడా బీజేపీ ప్రభుత్వం ఏ కేసు పెట్టలేదని వెల్లడించారు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై  కేసులు పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా..ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఎలాంటి ఏ కేసు పెట్టలేదని చెప్పారు.  

Also Read :- కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత హామీలు ఇవే

తెలంగాణ ఇస్తామని చెప్పినం ఇచ్చామన్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెబుతున్నాం..అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కోసం రూ. 5 లక్షల నగదు ఇస్తామన్నారు. 250 చ. గజాల స్థలం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో ఇండ్లు లేని వారికి  ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతీ నెల రూ. 2500 ఇస్తామన్నారు.  రూ. 500 కే సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. అందరికి 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు. రూ. 5 లక్షల వరకు కాలేజీ విద్యార్థులకు కోచింగ్ ఫీజు కోసం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ. 4000 వేలు పింఛన్ ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షల వరకు పెంచుతామని చెప్పారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామన్నాురు. అలాగే రైతు కూలీలకు రూ. 12 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. 

9 ఏండ్ల పాటు..ప్రజల ఆస్తులు, సొమ్ములు దోచుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాక్కున్నదన్నారు. దళితుల నుంచి భూములు లాక్కున్నదని చెప్పారు.  రైతు బంధు పథకం ద్వారా పెద్ద భూస్వామములకు మాత్రం లాభం చేకూరిందిన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో టీఎస్పీఎస్సీ పేపర్లు లీకయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా..నోటిఫికేషన్ వేయడం లేదని మండిపడ్డారు. 

మోదీ ప్రభుత్వం అదానీ కోసం పనిచేస్తుందన్నారు రాహుల్ గాంధీ. మోదీ వల్ల అదానీ ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడని చెప్పారు. తా అదానీని గురించి పార్లమెంట్ లో  స్పీచ్ ఇస్తే తనను  ఎంపీ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్..వారి కుటుంబ సభ్యుల కోసం ప్రజల ఆస్తిని పంచిపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎంతో అవినీతి జరుగుతున్నా..మోదీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్య తీసుకోవడం లేదని చెప్పారు.