రాహుల్ రూ.1000 కోట్లు తీస్కొని రేవంత్కు పదవిచ్చిండు : కేఏ పాల్

రాహుల్ రూ.1000 కోట్లు తీస్కొని రేవంత్కు పదవిచ్చిండు : కేఏ పాల్

రాహుల్ గాంధీ రూ.1000 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంత మంది సీనియర్లు ఉండగా.. ఆయనను ఎందుకు అధ్యక్షుడిని చేశారని ప్రశ్నించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం కాకపోతే టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ను  కూల్చాలని తగలబెట్టాలంటూ టెర్రరిస్టులా మాట్లాడుతున్న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీకి లెటర్ రాసినట్లు కేఏ పాల్ చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీపీసీసీ పదవిని డబ్బులు పెట్టి కొనడం, ఓటుకు నోటు కేసులో దొరికినా ప్రభుత్వానికి ప్రజలకు భయపడకపోవడమే రేవంత్ రెడ్డి బలమా అని ప్రశ్నించారు.

చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రజా శాంతి పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారని కేఏ పాల్ చెప్పారు. ఇప్పుడున్న పార్టీ లీడర్ లు ప్రజల కోసం పనిచేయడం లేదని, ఒకరిని ఒకరు తిట్టుకోవడం అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కొత్త సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి, కేసీఆర్ పుట్టినరోజున ఎలా ప్రారంభిస్తారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గానికి చెందిన తనను సీఎంను చేస్తే మంచి పాలన ప్రజల రక్షణకు ముందుంటానని హామీ ఇచ్చారు.