
అసెంబ్లీ, లోక్ సభలో మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం అసోంలోని కోరాపుట్ జిల్లా జేపో లో మహిళలతో రాహుల్ ముఖాముఖీ జరిపారు. ఒడిశాలో కాంగ్రెస్ ను గెలిపిస్తే పెళ్లైన పేద మహిళలు, వితంతువులకు రూ.2000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. 2014 ఎన్నికల్లో మహిళా బిల్లుకు వాగ్దానం చేసిన బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. అసోం మంత్రివర్గంలో ఇద్దరే మహిళలకు చోటు కల్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళా సాధికారతకు నిజమైన అర్థం ఏమిటో తాము అధికారంలోకి రాగానే ఆచరణలో చూపిస్తామని, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలతో సహా అన్ని దశల్లోనూ ఒడిశా మహిళలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.