మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ కిషోర్ మారిశెట్టి నిర్మాతగా రోహిత్, శశి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న కథ సుధ చిత్రం ‘ఇల్లు’. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, అనీష్ కురివిల్లా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 14 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ‘ఒక సాధారణ కథను సహజసిద్ధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం ఎంతో క్లిష్టమైన విషయం.
‘ఇల్లు’ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది’ అని అన్నాడు. రెగ్యులర్‌గా చేసే నటన నుంచి ఇది కాస్త భిన్నంగా ఉంటుందని నటీనటులు అన్నారు. ఈ చిన్న కథను చాలా పెద్దగా చూపించబోతున్నామని దర్శకుడు రోహిత్ చెప్పాడు. ఇలాంటి కొత్త కంటెంట్‌ను నిర్మించడం సంతోషంగా ఉందని కిషోర్ మారిశెట్టి అన్నారు.
