దొంగలందరి పేరు మోడీనే: రాహుల్ గాంధీ

దొంగలందరి పేరు మోడీనే: రాహుల్ గాంధీ

జార్ఖండ్: రాంచీలో ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై విమర్శలు చేశారు. సైన్యంపై కాంగ్రెస్ కు అనుమానాలున్నాయని ప్రధాని చేసిన విమర్శలు తిప్పికొట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశాన్ని కాపాడుతుందని, వాయుసేన పైలట్లు ప్రాణాలు కూడా లెక్క చేయక పోరాడుతున్నారని అన్నారు. ఎయిర్ ఫోర్స్ డబ్బును మాత్రం ప్రధాని మోడీ దోచి, అనిల్ అంబానీ జేబులో వేశారనీ… ఇది చాలా దారుణమనీ అన్నారు రాహుల్.

దేశాన్ని దోచుకున్న దొంగల పేర్లలో మోడీ పేరే ఉందని సెటైర్ వేశారు రాహుల్ గాంధీ. లలిత్ మోడీ… నీరవ్ మోడీ… నరేంద్రమోడీ.. వీళ్లలో మోడీ అనే పేరు కామన్ గా ఎందుకు ఉందో అర్థం కావడం లేదని.. ఎవరైనా చెప్పాలని అన్నారు రాహుల్ గాంధీ.

రాంచీలో రాహుల్ స్టెప్పులు

రాంచీలో సభ ప్రారంభానికి ముందు.. రాహుల్ గాంధీ స్థానికులు, కళాకారులతో జానపద పాటలు పాడుతూ… స్టెప్పులేశారు.