పానా, స్క్రూడ్రైవర్‌ చేతపట్టిన రాహుల్​గాంధీ

పానా, స్క్రూడ్రైవర్‌ చేతపట్టిన రాహుల్​గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పానా, స్క్రూడ్రైవర్​ చేతపట్టారు. కొద్ది సేపు బైక్​మెకానిక్​ గా మారిపోయారు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఢిల్లీలో..  ఆ వివరాలేంటో చూసేద్దాం పదండీ. జూన్​27న రాత్రి ఢిల్లీలోని కరోల్​బాగ్​ సైకిల్​ మార్కెట్లోని బైక్​ రిపేర్​ షాప్​కి రాహుల్ వెళ్లారు. షాప్ యజమానికి వాహనాలు ఎలా రిపేర్​ చేయాలో తెలుసుకున్నారు. సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

కస్టమర్లు, వ్యాపారులతో ముచ్చటించారు. ఆ చేతులే భారత్​ ని నిర్మిస్తాయని ఆయన పేర్కొన్నారు. వారి దుస్తులపై ఉన్న మసి మరకలు గర్వానికి నిదర్శనమని, వారి వెన్నంటి నిలబడి ప్రోత్సహించేది మాత్రం ప్రజా నాయకుడేనని పేర్కొంటూ కాంగ్రెస్​ పార్టీ తన ట్విటర్​ అకౌంట్​లో పోస్​ చేసింది.