
భారత్ పాకిస్తాన్ ఉద్రక్తతలు తీవ్రం అవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో జనావాసాలే టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మే 10న ఉదయం 6 గంటలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసిన కొద్దిసేపటికే రెడ్ అలర్ట్ వచ్చింది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగాయి. భద్రతాదళాలు భారీగా మోహరించాయి. అధికారులు అప్రమత్తమై పౌరులను అలర్ట్ చేస్తున్నారు. ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఢిల్లీ వైపు ఫతా-2 క్షిపణిని ప్రయోగించింది. దీనిని సిర్సాలో భారత్ విజయవంతంగా అడ్డగించింది
ప్రార్థనా మందిరాలు, టెంపుల్స్, సామాన్య పౌరులనే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఓవైపు డ్రోన్లతో దాడులు చేస్తూనే సరిహద్దులో కాల్పులకు తెగబడుతోంది మే 10న ఉదయం పాక్ జరిపిన కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారు రాజ్ కుమార్ మరణించారు.
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో సహా భారతదేశం అంతటా మే 9న 20 నగరాలపై పాకిస్తాన్ డ్రోన్‌లు దాడి చేసింది . పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో 16 మంది చనిపోయారు. వారిలో ఓ జవాన్ కూడా ఉన్నాడు. అనేకమంది సాధారణ ప్రజలు గాయపడ్డారు. పాకిస్తాన్ దాడులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమర్థంగా అడ్డుకున్నది. పాక్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్స్‌ను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి.. కూలిపోయిన డ్రోన్లు, మిసైళ్ల పార్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.