రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాలు

రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. భారతీయ రైల్వేకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ(RWF) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్ వీల్ ఫ్యాక్టరీలో ట్రెడ్ అప్రెంటీస్ పోస్టుల్లో మొత్తం 192 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఇందులో ఫిట్టర్, మెకానిక్, టర్నర్ ఎలక్ట్రిషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17న ప్రారంభమైంది.

దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నవంబర్ 15 లోపు పంపించాలి. ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనుంది. పూర్తి వివరాలకు రైల్వే అఫీషియల్ వెబ్ సైట్ https://rwf.indianrailways.gov.in లో చూడవచ్చు.