రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఆగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం

రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఆగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వంభూమిని కేటాయిం చలేదని, అందుకే పనులుముందుకు సాగడం లేదని రైల్వే బోర్డు రోలిం గ్‌ స్టాక్‌‌‌‌ మెంబర్‌ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. దీని కోసం రూ.200 కోట్లు కేటాయిం చామని, ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంభూమి కేటాయిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను రైల్ వికాస్ నిగం సంస్థకు అప్పజెప్పామని తెలిపారు. 2020 ఏప్రిల్ నాటికి కర్నూల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధమవుతుందని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈఏడాది వందేభారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ను ప్రారంభించామని, సెమీ హైస్పీడ్ ట్రైన్ల తయారీకి శ్రీకారం చుట్టామనిచెప్పారు. దీంతో 50 శాతం ప్రయాణ సమయం తగ్గిందని పేర్కొన్నారు. వీటిని త్వరలో దక్షిణ మధ్యరైల్వేలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇవి 160కిలోమీటర్ల వేగానికి అనుకూలంగా ఉంటాయని వివరించారు. రైళ్లలో వంద శాతం బయో టాయిలెట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.

ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీ, ఆటో డోర్లు
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీ, ఆటో డోర్లు పెట్టబోతున్నట్లు రాజేశ్ అగర్వాల్ తెలిపారు. మెమూరైళ్లను మరింత ఆధునీకరిస్తామని, లేటెస్ట్ టెక్నాలజీఉన్న ఐసీఎఫ్(ఇంటిగ్రల్‌‌‌‌ కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ) కోచ్‌‌‌‌లనుతయారు చేస్తున్నామని చెప్పా రు. దేశంలో మెట్రోరైళ్ల అవసరం చాలా ఉందని, డిమాండ్‌‌‌‌కు అనుగు-ణంగా తయారీ చేపడతామని పేర్కొన్నారు. మేడిన్ఇండియా మెట్రో ట్రైన్లు ఈ ఏడాది నుం చి అందుబా-టులోకి రానున్నాయని తెలిపారు. ఎప్పుడు ఆర్డర్స్వచ్చినా మెట్రో రైలు అందించేం దుకు సిద్ధం గాఉన్నామని ఆయన చెప్పారు. రైల్వే కోచ్‌‌‌‌లలో విద్యుత్వినియోగం కోసం సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎంఈ అర్జున్ముండియా మాట్లాడుతూ 12 కార్ రైళ్లు అందుబా-టులోకి తెచ్చామని, ప్రస్తుతం వాటిని పాత కారిడార-్లలోనే వాడుతామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ కొత్తరూట్లు అందుబాటులోకి వచ్చేందుకు సమయంపట్టవచ్చన్నారు.