చిన్నారి ఆకలి కోసం..కదులుతున్న ట్రైన్ వెంట పరుగెత్తిన కానిస్టేబుల్

చిన్నారి ఆకలి కోసం..కదులుతున్న ట్రైన్ వెంట పరుగెత్తిన కానిస్టేబుల్

చిన్నారి పాల కోసం పరుగెత్తి  కదులుతున్న ట్రైన్ లో వెళుతున్న తల్లికి పాలు అందించి ఆ చిన్నారి ఆకలి తీర్చాడు  భోపాల్ రైల్వే పోలీస్ .  కదులుతున్న రైలులో ఉన్న పసికందుకు పాలు ఇవ్వడం కోసం  కానిస్టేబుల్ పరుగెత్తిన తీరుపై అందరు ప్రశంసిస్తున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ వెళుతున్న ఓ మహిళ.. తన 4 నెలల చిన్నారికి పాలు కావాలని భోపాల్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న  రైల్వే పోలీస్ ఇందర్ యాదవ్ ను కోరారు. ఆయన పాలు తెచ్చే లోపే రైలు కదిలింది. దీంతో ఎలాగైనా చిన్నారికి పాలు ఇవ్వాలనే తపనతో.. ఒక చేతిలో రైఫిల్.. మరో చేతిలో పాల ప్యాకెట్ తో బుల్లెట్ లా పరుగెత్తాడు ఇందర్ యాదవ్. పాలను తల్లికి అందించాడు.

కానిస్టేబుల్ పరుగెత్తిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ తల్లికి ఇందర్ యాదవ్ కు కృతజ్ఞతలు చెప్పింది. చిన్నారికి పాలు ఇవ్వడానికి ఇందర్ యాదవ్ అద్బుత పనితీరు ప్రదర్శించారని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయెల్ అభినందించారు. ఇందర్ యాదవ్ కు నగదు కానుకగా ప్రకటించారు.

 

see more news

24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి

చాహల్ పై యువరాజ్ సింగ్ కామెంట్స్..పోలీస్‌‌ కేసు నమోదు

గర్భిణికి గుండెపోటు..ఆమెతో పాటు కడుపులోని కవలలు మృతి