 
                                    హైదరాబాద్‌సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0ను నవంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పెన్షనర్లకు ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా యాప్‌ద్వారానే డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. క్యాంపెయిన్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హేమ సునీత ఆవిష్కరించారు. ఆర్థిక సలహాదారు అభిషేకానందరావు, పీఎఫ్‌ఏ కార్యాలయంలోని ఇతర అధికారులు పాల్గొన్నారు.

 
         
                     
                     
                    