
- ఆమోదం తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మంగళగిరి – కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య రూ.112 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనకు శుక్రవారం రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ఆర్వోబీ ఏపీ రాజధాని అమరావతి, ఏపీలోని నేషనల్ హైవే-–16 మధ్య అనుసంధాన రహదారిపై ఉంది.
భవిష్యత్తు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు లేన్ల ఆర్వోబీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీన్ని నిర్మాణం100 శాతం రైల్వే నిధులతో జరగనుందని అధికారులు తెలిపారు. టెండరింగ్ ప్రక్రియకు ముందే డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి పనులు పూర్తవుతాయని చెప్పారు.