అలర్ట్: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

అలర్ట్: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందన్నారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే చాలా ధాన్యం తడవటంతో రైతులు అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు.