తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

  తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 2024 జూన్ 12వ తేదీన పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.   రాష్ట్రంలో ఈ రోజు నుంచి మూన్ సున్ సీజన్ ప్రారంభం కానుంది.  కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం  ఉందని తెలిపింది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  

రాష్ట్రంలో గురువారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్​, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగే అవకాశం ఉందని సూచించింది.