తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నైరుతి, పశ్చిమ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని.. దీని కారణంగానే  రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని..వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.