ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి

ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కురిసిన కుండపోత వర్షం, గాలి దుమారం కారణంగా ఆరుగురు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. భారీ వర్షంతో చెట్లు, స్తంభాలు కూలి ఇండ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి 7.50 గంటలకు నిజాముద్దీన్ ప్రాంతంలోని లోధి రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయి మీద పడటంతో ఓ దివ్వ్యాంగుడు చనిపోయాడు. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌‌పురిలో చెట్టు కూలి ఓ వ్యక్తి మరణించారు. ముఖర్జీ నగర్ లో బ్రిడ్జి గ్రిల్  విరిగిపడి ఆరుగురు గాయపడ్డారు.

కాగా, బుధవారం 200 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరిన విమానం గాలి దుమారంలో చిక్కుకుని ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.  ప్యాసింజర్లు భయాందోళనలకు గురయ్యారు. చివరకు పైలట్ విమానాన్ని సేఫ్‎గా ల్యాండ్ చేశారు. అయితే, టర్బులెన్స్‎ను తప్పించుకునేందుకు పాక్ ఎయిర్ స్పేస్‎ను కొద్దిసేపు వాడుకునేందుకు అనుమతించాలని పైలట్ కోరగా.. పాక్ తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు.