వర్షాలతో మళ్లీ పెరిగిన టమాటా : హోల్ సేల్ మార్కెట్లోనే ఊహించని ధర

వర్షాలతో మళ్లీ పెరిగిన టమాటా : హోల్ సేల్ మార్కెట్లోనే ఊహించని ధర

టమాటా ధరలు రోజు రోజుకు సామాన్యుడ్ని బెంబేలెత్తిస్తున్నాయి. ధరలు కాస్త తగ్గుతాయని భావిస్తే.. ఇప్పుడు భారీగా పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్కరోజులనే కేజీకి రూ.28 వరకు పెరిగింది. అలాగే మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గింది. వర్షాల కారణంగా దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకా పెరుగుతాయనే భయం మొదలైంది. అదే జరిగితే పరిస్థితి ఏంటని సామాన్యుడు భయపడతున్నాడు.

టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. నెల రోజులుగా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరలు కాస్త తగ్గుతాయని అంచనా వేస్తే.. మళ్లీ మార్కెట్‌లో రేట్లు పెరుగుతున్నాయి.  దక్షిణ భారతదేశంలోనే  పెద్ద కూరగాయల మార్కెట్‌  చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో   టమోటాల దిగుమతి తగ్గడంతో...  రిటైల్‌ మార్కెట్‌లో టమాట ధర కిలో రూ.170కి  చేరింది.  ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షం కారణంగా టమోటా మార్కెట్ కు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది.

కోయంబేడు మార్కెట్‌ కు రోజుకు 800 టన్నుల టమోటా లోడ్ వస్తుందని ... అది ఇప్పుడు 250 టన్నులకు పడిపోయిందని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక  రాష్ట్రాల్లో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  టమోటా పంటలు ధ్వంసమవడంతో దిగుబడి  తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. అధిక ధరల కారణంగా చాలామంది  ప్రజలు  టమోటాకు దూరంగా ఉండటంతో  వినియోగం కూడా తగ్గింది..

తేనాంపేటకు  మార్కెట్‌లో  వ్యాపారులు జీవించడం చాలా కష్టంగా ఉందని  రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.  . టమాటా ధరలు స్థిరంగా ఉండకపోవడంతో వాటిని అమ్మడానికి చాలా కష్టపడుతున్నామన్నారు. దీంతో   తమిళనాడు ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) దుకాణాల ద్వారా కిలో 60  రూపాయిలకు  టమాటాలను విక్రయించడం ప్రారంభించింది. అయితే, టమాటా నాణ్యత తక్కువగా ఉందని.... టమాటా కొనుగోలు చేయాలనుకునే వారు పబ్లిక్ మార్కెట్‌పైనే ఆధారపడుతున్నారు. పిడిఎస్ దుకాణాల్లో విక్రయించే టమోటాల నాణ్యత  చాలా తక్కువగా ఉన్నందున ...ప్రభుత్వం టమోటాలను విక్రయించకపోవడమే మంచిదని మహిళలు చెబుతున్నారు.  ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది  రిటైల్ మార్కెట్ల నుండేకొనుగోలు చేస్తున్నారు. 

టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులకు కూరగాయలు దూరమవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కేరళకు వచ్చే టమాటా లోడులు  తగ్గిపోయాయి.   వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది.. దిగుబడి తగ్గడం వల్లే ధరలు మళ్లీ పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు.. అదే జరిగితే సామాన్యుడు టమాటాలను కొనలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.