
హైదరాబాద్ : ఉదయం నుంచి రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా వెదర్ కూల్ అయింది. అయితే ఉక్కపోత జనాలను ఇబ్బంది పెడుతోంది. ఇవాళ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రేపు ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందన్నారు. ఉపరితల ద్రోణి ఛత్తీస్ గడ్ మీదుగా తెలంగాణ వరకు విస్తరించి ఉందని దాని ప్రభావంతో వాతావరణం చల్లబడిందన్నారు.