PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం

PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం

భారత్‌లో భానుడు భగభగమంటున్న వేళ.. దాయాది దేశం పాకిస్తాన్‌లో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20కి అడ్డుపడుతున్నాడు. ఫలితంగా మ్యాచ్ ఆలస్యమవుతోంది. టాస్ వేరే సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న వరుణుడు.. మ్యాచ్ మొదలై బంతి పడటానికి కొన్ని సెకెన్ల ముందు మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు.. ఆటను నిలిపివేశారు. 

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ వెల్లడించాడు.

తుది జట్లు

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), టిమ్ రాబిన్సన్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జోష్ క్లార్క్సన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ, బెన్ సియర్స్, బెన్ లిస్టర్.

పాకిస్తాన్: బాబర్ ఆజం(కెప్టెన్), సయీమ్ అయూబ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, అబ్రార్ అహ్మద్.