భద్రాచలంలో ఒక్క గంట దంచికొట్టిన వాన.. పరిస్థితి ఎలా అయిందో చూడండి..

భద్రాచలంలో ఒక్క గంట దంచికొట్టిన వాన.. పరిస్థితి ఎలా అయిందో చూడండి..

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వర్షం దంచికొట్టింది. దాదాపు ఒక గంట పాటు కురిసిన భారీ వర్షానికి వరద ఏరులై పారింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షానికి పట్టణంలోని డ్రైనేజీ మురుగు నీరు రామాలయం పడమర మెట్ల వైపునకు వచ్చి చేరింది. వర్షపు నీటితో పట్టణంలోని డ్రైనేజీ నీరు రామాలయ అన్నదాన సత్రం దారిలో, అన్నదాన సత్రంలోకి  మోకాళ్ళ లోతు వరకూ వర్షపు డ్రైనేజీ నీరు వచ్చి చేరింది.

భద్రాచలంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. పట్టణంలోని పలు కాలనీ దారులు పూర్తిగా డ్రైనేజీ మురుగు నీటితో పొంగి పొర్లుతుండటంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 

ఒక్క గంట పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని డ్రైనేజీ నీరు వర్షపు నీటితో కలిసి పలు కాలనీలు రామాలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట దగ్గర స్లూయిజ్లు మూసివేసి ఉండడంతో పట్టణంలోని డ్రైనేజీ నీరు అన్నదాన సత్రం ప్రాంతం అంతా రావడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.