కొలొంబోలో భారీ వర్షం.. మ్యాచ్ జరిగే అవకాశం ఎంతంటే ?

కొలొంబోలో భారీ వర్షం.. మ్యాచ్ జరిగే అవకాశం ఎంతంటే ?


భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానులకి బ్యాడ్ న్యూస్. వర్షం కారణంగా మ్యాచ్ కి రిజర్వ్ డే ని ప్రకటించినా అభిమానులకి మరోసారి నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం కొలొంబోలో వర్షం విజ్రంభిస్తుంది. అక్కడ వాతావరణం ఏమంత  గొప్పగా లేదు. కవర్లు కూడా ఇంకా పిచ్ మీద కప్పబడి ఉన్నాయి. తాజా సమాచార ప్రకారం ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పాటు  గ్రౌండ్స్‌మెన్ కవర్లలోని నీటిని బయటకు తీయడానికి కూడా ప్రయత్నించడం లేదు.

ఒకవేళ వర్షం తగ్గినా..కవర్లు తీసి పిచ్ ని బాగు చేసేలోపు వర్షం పడే అవకాశం ఉంది. నిన్నంతా గ్రౌండ్ స్టాఫ్ మైదానం అంతా ఎంతో కష్టపడి క్లీన్ చేసినా.. పదే పదే వర్షం పలకరించడంతో మ్యాచ్ ని నిలిపివేసి నేటికీ వాయిదా వేశారు. మరి ఒకవేళ వరుణుడు శాంతించి మ్యాచ్ జరిగితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. 

మ్యాచ్ జరిగే అవకాశం ఎంతంటే ?

అభిమానులకి ఊరటనిచ్చే అవకాశం ఏదైనా ఉందంటే అది 20 ఓవర్ల మ్యాచ్ అని చెప్పుకోవాలి. వర్షం పడినా.. రాత్రి 10:36 కి వరుణుడు కరుణించినా 20 ఓవర్ల మ్యాచ్ ని నిర్వహిస్తారు. ఒకవేళ 10:36 కూడా వర్షం పడితే ఇక మ్యాచ్ పూర్తిగా రద్దయినట్టు అంపైర్ లు ప్రకటిస్తారు.